Purandeshwari సోము వీర్రాజు నుంచి బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన పురందేశ్వరి ఇక దాడిని పెంచింది. సోముకు టీడీపీకి, వైసీపీకి, జగన్ కు పార్టీ పరంగానైనా, రిలేషన్ పరంగానైనా ఎటువంటి సంబంధం లేదు కానీ పురందేశ్వరికి చంద్రబాబుకు మాత్రం రిలేషన్ షిప్ ఉంది. ఆమెకు చంద్రబాబు వరసకు బావ అవుతాడు. గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో పోలవరం ప్రారంభమైంది. దీని కోసం కేంద్రం కోట్లాది రూపాయల నిధులను ఇచ్చింది. వీటన్నింటినీ తీసుకచ్చిన బాబు డ్యాంలో పోశాడు.
పోలవరం ప్రాజెక్టు కడుతున్న సమయంలో పక్కన కాపర్ డ్యాం నిర్మించారు. అయితే అది కాస్తా కొట్టుకుపోయింది. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని మాత్రం పురందేశ్వరి ప్రస్తావించడం లేదు. చంద్రబాబుకు దీనికి ఎటువంటి లింకు లేదన్నట్లు మాట్లాడుతుంది. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని చెప్పిన ఆమె కాపర్ డ్యాం కొట్టుకుపోవడంలో పాత్ర వారిదే? అన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. కాపర్ డ్యాం దెబ్బతిన్నది కాబట్టి దాని కోసం 2000 కోట్ల రూపాయలు, మిగతా ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇవ్వాల్సిన డబ్బులను కేంద్రం ఇస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటుంది పురందీశ్వరి.
అయితే, ఇందులో చంద్రబాబు పాత్రను మాత్రం ఆమె ప్రస్తావించడం లేదు. పోలవరం మొదలు పెట్టిన సమయంలో బాబు ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ లో కొలువై ఉంది. దాని జాప్యానికి, కాపర్ డ్యాం దెబ్బతినడానికి కారణం చంద్రబాబని తెలిసినా ఆయన పేరు ఎత్తకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతైనా మరదలే కదా! బావ కడుపు చల్లగా ఉండాలని చూస్తుందో ఏమో? అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు
పోలవరం లేట్ అవటానికి ప్రధాన సమస్య కాఫర్ డ్యాం కొట్టుకుపోవటం..
ఎంత నిధులు ఇచ్చారో చెబుతుందిగానీ.. బావ నిర్వాకం వల్ల కాఫర్ డ్యాం సంకనాకిపోయిందని చెప్పటానికి మొహమాట పడుతోంది పాపం.. pic.twitter.com/XjTrfRM7Kd— Political Punch (@PoliticalPunch9) July 13, 2023