ఆంధ్రప్రదేశ్ లో 2018 తో పోల్చితే 2021 నాటికి గణనీయంగా అత్యాచారాలు పెరిగాయని లెక్కలతో సహా వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా నేరాల గురించి , మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో 2018 నుండి 2021 మధ్య కాలంలో మహిళలపై 4340 అత్యాచారాలు జరిగాయని , 8406 సంఘటనలు ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఉదంతాలు చోటు చేసుకున్నాయని , ఇక 18,883 సాధారణ దాడులు జరిగాయని , ఇక దేశం మొత్తం మీద అత్యధిక సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లోనే జరిగాయని వెల్లడించారు. అసలు మహిళలపై జరుగుతున్న దాడుల్లో మొదటగా ఉత్తరప్రదేశ్ , బీహార్ రాష్ట్రాలు ఉండేవి కానీ ఇప్పుడు ఆ రికార్డ్ ను బద్దలు కొట్టి మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది ఏపీ.