తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మహిళలు మృతి చెందగా…..మరో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. దాంతో వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురు ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ సంచలన సంఘటన గుంటూరు జిల్లా వికాస్ నగర్ లో చోటు చేసుకుంది. ఇటీవలే నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరుగగా ఆ సంఘటనలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే మళ్ళీ గుంటూరు సభలో తొక్కిసలాట జరగడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర షాక్ కు గురయ్యాయి.
Breaking News