39.9 C
India
Tuesday, April 21, 2026
More

    జగన్ కు షాకిచ్చిన సుప్రీం కోర్టు

    Date:

    supreme court gives shock to ys jagan in amaravathi issue
    supreme court gives shock to ys jagan in amaravathi issue

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చింది సుప్రీం కోర్టు. అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. తదుపరి విచారణను జులై 11 కు వాయిదా వేసింది. అమరావతి తీర్పు పై స్టే ఇవ్వాలని జగన్ సర్కారు సుప్రీం కోర్టును పదేపదే అభ్యర్ధించినప్పటికీ సుప్రీం కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు.

    ఆంధ్రపద్రేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని , తక్షణమే పనులు చేపట్టాలని ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పు పై సుప్రీం కు వెళ్ళింది జగన్ సర్కారు. ఏపీ రాజధానిగా వైజాగ్ ను చేయాలని , అక్కడి నుండే పరిపాలన సాగించాలని భావిస్తోంది. దాంతో సుప్రీం ను ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని పదేపదే కోరినప్పటికీ సుప్రీం మాత్రం అందుకు అంగీకరించకుండా జులై 11 కు వాయిదా వేసింది.

    అయితే జగన్ సర్కారు అమరావతి తీర్పు పై స్టే కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా అమరావతి రైతులు కూడా సుప్రీం తలుపు తట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వాలని , హైకోర్టు తీర్పును యథాతధంగా అమలు పరచాలని కోరుతున్నారు. దాంతో ఇరువురి వాదనలను మరోసారి  జులై 11 న విచారించనుంది సుప్రీం కోర్టు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీపై హైకోర్టులో పిటిషన్

    Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్...

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...

    Comments on YS Jagan : వైఎస్ జగన్ కుటుంబంపై దారుణ కామెంట్స్.. కలకలం

    Comments on YS Jagan : రాజకీయ విమర్శలు సిద్ధాంత పరంగా...