
గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా 3 రాజధానుల అంశం లేదని , కానీ ముఖ్యమంత్రి జగన్ అలాగే ఇతర మంత్రులంతా మూడు రాజధానుల గురించి బయట మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. పాత గవర్నర్ ను మచ్చిక చేసుకుని ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా నడిపించారు. ఇక ఇప్పుడేమో సుప్రీంకోర్టు లో న్యాయమూర్తి గా పనిచేసిన వ్యక్తి గవర్నర్ గా వస్తే ఆయన్ని గవర్నర్ స్థాయి తగ్గించేలా ఆయన చేత ముఖ్యమంత్రి ని పొగిడించే కార్యక్రమం పెట్టుకున్నారని ….. అసలు గవర్నర్ ఎక్కువా ? ముఖ్యమంత్రి ఎక్కువా ? అని ప్రశ్నించాడు పయ్యావుల. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ గవర్నర్ ప్రసంగంలో మాత్రం చేర్చలేదని , గవర్నర్ ను స్పీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేసి అవమానించారని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు .