
సైకో …… సైకో పోవాలి …… సైకిల్ రావాలి అంటూ పండగ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే కాదు సుమా ! ఏపీలో చాలామంది ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. ఏపీ ప్రజలు మాత్రమే కాకుండా పలువురు ఎన్నారైలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ” సైకో పోవాలి – సైకిల్ రావాలి ” అంటూ నినదిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణే ఏపీ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ లోని 9 జిల్లాలలో అలాగే 108 నియోజకవర్గాలలో జరిగాయి. మరో డేంజర్ బెల్ ఏంటంటే రాయలసీమ ప్రాంతంలోని ప్రజలు కూడా అధికార వైసీపీకి గట్టి బుద్ది చెప్పారు. దాంతో నిన్న మొన్నటి వరకు ” వై నాట్ 175 ” అంటూ అడిగిన జగన్ కు కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. అయితే పట్టభధ్రులు ఇంతగా బుద్ది చెప్పినప్పటికీ అధికార వైసీపీ మాత్రం బయటకు చెబుతున్నది ఏంటో తెలుసా …… ఈమాత్రం దానికే సంబరాలా ? అని. కానీ లోలోపల మాత్రం వైసీపీ నాయకులు అలాగే అధినేత కూడా ఘోర పరాజయంగా భావిస్తున్నారట. ఇక టీడీపీ శ్రేణులు సరికొత్త జోష్ తో సైకో పోవాలి …… సైకిల్ రావాలి అంటూ పండగ చేసుకుంటున్నారు.
