పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 107 వ జయంతి వేడుకలు విజయవాడలోని సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. దీన్ దయాల్ ఉపాధ్యాయ శ్రవణ ఫౌండేషన్ ఫౌండర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో చెవిటి వారికి అలాగే వికలాంగులకు పరికరాలను గవర్నర్ చేతుల మీదుగా అందించారు.
అలాగే ఇదే వేడుకలో UBlood App బ్రోచర్ ని ఆవిష్కరించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. రక్తదానం విశిష్టతని తెలియజేసే కార్యక్రమం కావడంతో గవర్నర్ యుబ్లడ్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తో పాటుగా బీజేపీ నాయకులు , మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం , దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఫౌండర్ రామాంజనేయులు , RSS ప్రాంత ప్రచారక్ ఆదిత్య , గవర్నర్ చీఫ్ సెక్రటరీ సిసోడియా , రామినేని ధర్మా , రంగరాజన్ లతో పాటుగా యు బ్లడ్ ప్రతినిధి బృందం పాల్గొన్నారు.