YCP ఏపీలో వారాహి యాత్రతో జనసేన అధినేత పవన్ కల్యాన్ దూకుడు మీద ఉన్నాడు. అధికార పార్టీ మీద పంచులు, సెటైర్లతో ఆడుకుంటున్నాడు. గతంలో లాగా ఆవేశ పూరితమైన ప్రసంగాలతో కాకుండా ప్రజల సమస్యలను తన ప్రధానాస్ర్తాలుగా ఎక్కుపెడుతున్నాడు. ఎప్పటి లాగే అధికార పార్టీ నుంచి ఆ నలుగురే ప్రెస్ మీట్లతో కౌంటర్ వేస్తున్నారు. ఎలాగూ వైసీపీ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ ఎప్పటి లాగే పవన్ కల్యాణ్ ను ముగ్గరు పెళ్లాలు, ఇంటర్ ఫెయిల్ అంటూ అవే పాత పోస్టులను రీపోస్టు చేస్తున్నాయి. అంతే కానీ పవన్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇవ్వడం లేదు. పవన్ ఆరోపణలు అబద్ధం అని మాత్రం గట్టిగా చెప్పలేకోపోతున్నాయి.
ఏపీ వలంటీర్ల వ్యవస్థ మీద పవన్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రం కిమ్మనడం లేదు. అంటే పవన్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని వారి మౌనమే సమాధానం అవుతున్నది. వలంటీర్లు మాత్రం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నిరసనలు తెలిపారు. అయితే అవి కూడా కేవలం అధికార పార్టీ ఆదేశాల మేరకు ఆందోళనలు చేసినట్లుగా తెలుస్తున్నది. వలంటీర్లలో కొందరు అవినీతికి పాల్పడింది నిజమే, వివాహేతర సంబంధాలు, హత్యలు, భూ కబ్జాలు బయటపడ్డాయి. అవి తప్పు అని వైసీపీ నాయకులు ఏ ఒక్కరూ ఖండించడం లేదు. గతంలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై జగన్ కూడా సరిగ్గా జవాబు చెప్పిందీ లేదు. అదే ముగ్గు పెళ్లాల పాటే పాడాడు. లేదంటే పొలిటికల్ గెస్ట్, చంద్రబాబు మాస్క్ అని చెప్పుకొచ్చాడు తప్ప తను చేసేది కరెక్టు అని ఎప్పుడు చెప్పలేదు.
ఇప్పుడూ చెప్పలేకపోతున్నాడు. వలంటీర్ల వ్యవస్థపై పవనల్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రజల్లో మాత్రం చర్చ జరుగుతున్నది. తమ సమాచారాన్ని అంతా ఎక్కడికి చేరవేస్తున్నారనే దానిపై చర్చించుకుంటున్నారు. వలంటీర్లు సేకరిస్తున్న సమాచారం బయటికి వెళ్లడం లేదని, గోప్యంగా ఉంటుందని ఏ ఒక్కరూ కూడా ప్రజలకు భరోసా ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ కూడా స్పందించాల్సి ఉన్నా ఎందుకో ముందుకు రావడం లేదు. జగన్ సైలెన్స్ ఉంటే పవన్ వ్యాఖ్యలు నిజమేనని ప్రజలు నమ్మే పరిస్థితి రావచ్చు. ఇప్పుడు జగన్ ప్రజల ముందుకు వచ్చి వలంటీర్లు చేసేది తప్పని చెబుతాడా, అక్కడక్కడ కొన్ని పొరపాట్లు ఉన్నాయని సర్దిచెప్పుకుంటాడా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఇన్నీ రోజులు వలంటీర్లు ప్రభుత్వానికి వారధిలో ఉన్నారని చెప్పిన జగన్ ఇప్పడేం చెబుతాడు అనే ఉత్కంఠ నెలకొంది.
జగన్ కు ఆ నలుగురే దిక్కా..?
ఏపీ సీఎం జగన్ పై వచ్చే విమర్శలకు కౌంటర్లు వేసే వారిలో కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా, పోసాని కృష్ణ మురళి ముందుంటారు. ఇటీవల అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని సైడ్ అయిపోయినట్లుగా కనిపిస్తున్నది. మళ్లీ అదే అంబటి రాంబాబు పంచ్ డైలాగులు, ప్రాసలు, పేర్ని నాని రుసరుసలు, రోజా సినిమా డైలాగులు, పోసాని కృష్ణ మురళి అవునా రాజా కామెడీ యే కనిపిస్తున్నది తప్ప పవన్ గట్టిగా కౌంటర్ ఇచ్చే నాయకుడు జగన్ క్యాంపులో కనిపించడం లేదు.