ఎన్టీఆర్ వెన్నుపోటు పై మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ భోళా మనిషి , ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అని అందుకే తనపై జరుగుతున్న కుట్రలను తెలుసుకోలేకపోయారని , అందుకే వెన్నుపోటుకు గురయ్యారని వ్యాఖ్యానించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.
సిద్ధాంతాలు వేరైనా సరే పద్ధతులు పాటించే వాళ్లంటే నాకు గౌరవం అందుకే ఎన్టీఆర్ ను అమితంగా గౌరవిస్తానని అన్నారు వెంకయ్య. ఇక ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని , అయితే ఇప్పుడు ఉచితాలు అనుచితం అంటూ వ్యాఖ్యానించారు. వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారాన్ని రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు నారా చంద్రబాబు నాయుడుకు కాస్త ఇబ్బంది కలిగించేవే అని చెప్పాలి. ఎందుకంటే నేను వెన్నుపోటు పొడవలేదు ……. తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడానికి నందమూరి కుటుంబంతో కలిసి తీసుకున్న నిర్ణయమని నొక్కి వక్కాణిస్తున్నాడు కాబట్టి.