ఏపీలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గతకొంత కాలంగా ప్రభుత్వానికి , ఉద్యోగులకు పద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు పట్టు వీడటం లేదు. ఇక ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోంది దాంతో ఉప్పు నిప్పు లా తయారయ్యింది పరిస్థితి. దాంతో ఈరోజు సెప్టెంబర్ 1 న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు ఉద్యోగులు.
ఛలో విజయవాడని జయప్రదం చేయాలని , ఉద్యోగుల శక్తి ఏంటో ప్రభుత్వానికి చాటి చేప్పేలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఏమాత్రం తీసిపోవడం లేదు. ఛలో విజయవాడ కార్యక్రమం జయప్రదం కాకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేయిస్తోంది జగన్ సర్కారు. కొంతమంది విజయవాడ సరిహద్దుల్లో ఉన్న విషయం తెలుసుకొని మరీ ముందస్తు అరెస్ట్ లు చేస్తోంది. దాంతో ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు.