
Ten thousand crores in AP : ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రాజెక్టు అయిన పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టేసి, ఇక నుంచి ఎటువంటి సాయం అడగబోమని రాసి ఇచ్చి తెచ్చుకున్న రూ. పది వేల కోట్లను అధికార పార్టీ ఏం చేసిందనేది చర్చనీయాంశంగా మారుతున్నది. కేంద్రం ఓ రాష్ర్టానికి వెయ్యి కోట్లు ఇస్తే.. నిధులు సాధించామని గొప్పగా చెప్పుకుంటారు అక్కడి పాలకులు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ విషయం బయటపడనివ్వకుండా దాచడంలో ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు.
ఈ విషయాన్నీ మీడియానే వెలుగు లోకి తెచ్చింది. ఆ తర్వాత తాకట్టు పెట్టిన విషయం బయ పడింది. అయినా ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఆ నిధుల్ని ఏం చేశారనే విషయం కూడా ప్రభుత్వం బయటకు రానియడం లేదు. నెల జీతాలకే నిధులు చాలడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీలకు నిధులు అవసరం. ఈ రెండు పథకాలకు ఎంత లేదన్న పది వేల కోట్లకుపైగా కావాలి.
కేంద్రం వద్ద ఏపీని తాకట్టు పెట్టి తెచ్చిన నిధులతో ఈ రెండు పథకాల నుంచి ఎలాగోలా బయట పడవచ్చు. దీనిపై ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటనలు రాలేదు. రూ. పది వేల కోట్లలో అప్పటికే నాలుగు వేల కోట్లు వివిధ రుణాల కింద ఆర్బీఐ జమ చేసుకున్నట్ల సమాచారం. మరో ఆరు వేల కోట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, రైతులకు రైతు భరోసా కింద జమ చేయనున్నట్లు సమాచారం. అయితే అమ్మఒడి కోసం మళ్లీ ప్రతి మంగళవారం బ్యాంకుల వల్ల వేలంలో పాల్గొనాల్సిందే.
కేంద్రం రూ. పది వేల కోట్లు ఇచ్చిన వారం తర్వాత ఆర్బీఐ వేలంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం రూ.రెండు వేల కోట్లను రుణాలను తీసుకు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఇచ్చిన రుణపరిమితిలో సగం మొదటి నెలన్నరలోనే తీసుకున్నారు. అమ్మ ఒడి కోసం మిగతా మొత్తం కూడా కూడా తీసేసుకొని పంచేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పరిస్థితి అదే. తెచ్చిన డబ్బులను జగన్ బటన్ నొక్కుడుకే వాడుతున్నారు. రెండు నెలల తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.