
Social media పచ్చ మీడియా పైత్యం రోజు రోజుకు పెచ్చుమీరుతోంది. అధినేత రాధాకృష్ణపై తన పేపర్ ద్వారా రాసిన రాతలపై ట్విటర్ తో పాటు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సామాన్యులు విరుచుకుపడుతున్నారు. ఇదేంటి జనాలు అంత తెలియని వారు అనుకుంటున్నారా? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఎంత టీడీపీ సపోర్ట్ పేపర్ అయితే మాత్రం మరీ ఇంత ఘోరంగా రాయాలా? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రాతలను రాను రాను ఎవరూ పట్టించుకోరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వానికి బద్ధ శత్రువైన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇటీవల తన పత్రికలో ఒక వ్యాసం ప్రచురించారు. ‘వైసీపీ ప్రభుత్వం వైరస్ లా సెల్ ఫోన్ లపై దాడి చేస్తుందని, విపక్ష నేతలతో పాటు, విమర్శకుల ఫోన్లను హ్యాక్ చేస్తుందని కథనం సారాంశం.’ దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. కనీస జ్ఞానం ఉన్నవారు సెల్ ఫోన్ వాడుతారు. అందులోకి వైరస్ రావడం ఏంటని? అంత తెలియని వారు ఎవరున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ పైత్యం ఏ స్థాయికి వెళ్లిందంటే సెల్ ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారు. చిన్నారుల ఫొటోలను కూడా బయటపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని మండిపడ్డుతున్నారు.
ఇలాంటి రూమర్లు క్రియేట్ చేసి, వాటిని పబ్లిక్ గా ప్రింట్ చేసి మరీ జనాలు భయపడుతుంటే ఆర్థనాధాలు శ్రవణానందకరంగా ఉన్నాయంటూ రాధాకృష్ణ సంబుర పడుతన్నాడని ట్విటర్ వేదికగా ఒక వీడియో బటయకు వచ్చింది. దీన్ని చూసిన ప్రతీ ఒక్కరూ షేర్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. పత్రికతో ప్రతిపక్ష హోదాలో పోరాటం చేస్తే ప్రజలకు మేలు చేసిన వాడివి అవుతావు కానీ.. ఇలా ఇబ్బందికరమైన వార్తలు రాస్తే ప్రజలు మరింత గందరగోళానికి గురికారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ రాతలతో జనాన్ని పక్కదారి పట్టించద్దని హెచ్చరికలు చేస్తున్నారు.
— Political Punch (@PoliticalPunch9) July 11, 2023






