
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు తొలగిస్తూ డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేయడంతో కలత చెందిన అధికార బాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేసాడు. మొదటి నుండి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన యార్లగడ్డ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అయితే కాలక్రమంలో జగన్ పార్టీలో చేరాడు.
యార్లగడ్డకు అనుభవం ఉండటంతో అతడికి అధికార బాషా సంఘం అధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు తొలగించడంతో మనస్తాపం చెందిన యార్లగడ్డ తన పదవికి రాజీనామా చేసాడు.