నెల్లూరు జిల్లాకు చెందిన అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. నిన్న నెల్లూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు వైసీపీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాడు.
అన్యాయాన్ని తట్టుకోగలం కానీ అవమానాలను తట్టికోలేమంటు ఆవేదన వ్యక్తం చేశాడట. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని , నన్ను నమ్ముకొని ఉన్న వాళ్లకు ఎలాంటి కష్టమొచ్చినా అండగా నిలబడతానని……. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తానని చెప్పిన వీడియో లీక్ అయ్యింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం పట్ల అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం గా ఉన్నాడట. శ్రీధర్ రెడ్డి ని పార్టీ నుండి బహిష్కరించడమా ? లేక దారికి తెచ్చుకోవడమా ? అనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.