
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అరుదైన సంఘటన జరిగింది. ఈరోజు ఏపీ.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా ఆ సమావేశంలో పాల్గొన్న అధికార పార్టీకి చెందిన YCP ఎమ్మెల్యే , సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికార పార్టీకి చెందిన సభ్యుల దగ్గర కూర్చోవాల్సింది పోయి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కేటాయించిన స్థానంలో కూర్చోవడం సంచలనంగా మారింది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలుమార్లు కేబినెట్ మినిస్టర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిస్థితుల వల్ల ఆనం రామనారాయణ రెడ్డి ని పొమ్మనలేక పొగ పెట్టారు జగన్. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆనం తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీలో అలాగే కాంగ్రెస్ పార్టీలో పని చేసిన సుదీర్ఘ అనుభవం ఉంది ఆనం కు. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులతో కలిసి కూర్చున్న ఆనం జగన్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాడనే చెప్పాలి.