
ఈరోజు అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టారు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు. నిన్న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అధికార వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ కు ఝలక్ ఇచ్చి తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేసి ఆమె గెలుపులో భాగస్వామ్యం అయ్యారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు ? అనే చర్చ సాగింది.
కట్ చేస్తే వాళ్ళు మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేలపై అనుమానం వ్యక్తం చేస్తూ చివరకు ఉండవల్లి శ్రీదేవి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేసారనే నిర్దారణకు వచ్చారు. అయితే ఉండవల్లి శ్రీదేవి మాత్రం నేను ఎలాంటి క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదు. నాకు ఏ కోడ్ అయితే ఇచ్చారో దాని ప్రకారమే ఓటు వేసాను అని వివరణ ఇచ్చింది. కట్ చేస్తే ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఉండవల్లి శ్రీదేవి , చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. దాంతో వైసీపీ ఆ ఇద్దరు మాత్రమే క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు ….. అందుకే ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు అంటూ చర్చించుకుంటున్నారు.