
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కి సవాల్ విసిరాడు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి ….. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఈరోజు విచారణకు రమ్మంటే నాకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ , సీబీఐ చెప్పిన సమయానికి , చెప్పిన చోటుకు వచ్చాను. కానీ దర్యాప్తు అధికారి మాత్రం రాలేదు అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దర్యాప్తు అధికారి లేకపోవడంతో మరోసారి పిలుస్తామన్నారని …… అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రే ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తండ్రీ కొడుకులు వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.