
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారనే ప్రతిపాదనలు కేంద్ర ఎన్నికల సంఘంకు పంపించారు. అయితే ఇది ప్రజాస్వామ్య దేశం కావడంతో ఎలాంటి రాజకీయ పార్టీ అయినాసరే ఎన్నికలు అనివార్యం. ఆయా పార్టీని బట్టి ప్రతీ రెండేళ్లకు తప్పనిసరిగా అధ్యక్షులను ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి శాశ్వత అధ్యక్షుడు అనేది చెల్లదని పలుమార్లు లేఖల ద్వారా తెలియజేసిందట కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఇన్నాళ్లు ఆ విషయాన్ని పెడచెవిన పెట్టడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీకి ఎన్నికలు జరగాల్సిందే అంటూ శాశ్వత అధ్యక్ష పదవిని నిరాకరించింది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.