
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తిగత సహాయకుడు డి. రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పులివెందుల లోని ఎస్ సి ఎస్ ఆర్ గార్డెన్స్ లో హేమలత – గంగాధర్ ల వివాహం జరుగగా సీఎం జగన్ తన శ్రీమతి వైఎస్ భారతితో కలిసి విచ్చేయడం విశేషం.
ముఖ్యమంత్రి సతీసమేతంగా తన కుమార్తె వివాహానికి హాజరు కావడంతో రవిశేఖర్ కుటుంబం పరవశించిపోయింది. రవిశేఖర్ వైఎస్ జగన్ వద్ద పీఏ గా పని చేస్తున్నాడు. ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కావడంతో పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.