హీరో విశాల్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నాడు ఈరోజు. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం ” లాఠీ ”. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఏపీలో అడుగుపెట్టాడు విశాల్. నిన్న తిరుపతిలో సందడి చేసాడు విశాల్. తన సినిమా ప్రమోషన్ తిరుపతిలో చేసాడు. అలాగే ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుస్తుండటంతో రాజకీయ వర్గాల్లో స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడును ఓడించడానికి విశాల్ ను వైసీపీ తరుపున పోటీ చేయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారాలను ఖండించాడు విశాల్. నేను చంద్రబాబు నాయుడుపై పోటీ చేసేదిలేదని , అసలు ఏపీ రాజకీయాల్లో తలదూర్చను అంటూ వ్యాఖ్యానించాడు . జగన్ అంటే అభిమానం …… అలాగే అతడికే నా ఓటు కానీ చంద్రబాబు మీద పోటీ చేసే ఉద్దేశం లేదు…….. ఏపీ రాజకీయాల్లోకి నేను వచ్చేది లేదు అంటూ కుండబద్దలు కొట్టాడు.
అయితే జగన్ ను కలిసిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోవడం ఖాయమని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. విశాల్ హీరో కాకముందు కుప్పంలో మూడేళ్ళ పాటు ఉన్నాడట. అక్కడ గ్రానైట్ వ్యాపారం చేసాడు. అందుకోసమే మూడేళ్ళ పాటు కుప్పంలో ఉండటం వల్ల ప్రజలతో ముఖ్యంగా యువతతో మంచి పరిచయాలు ఉన్నాయట. పైగా రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో విశాల్ కనుక రంగంలో ఉంటే చంద్రబాబు నాయుడుని ఓడించొచ్చు అని గట్టి నమ్మకంతో ఉన్నాడట ఏపీ ముఖ్యమంత్రి జగన్.
ఏపీలో 175 సీట్లకు గాను 175 గెలవాల్సిందే అని కసిగా ఉన్నాడు జగన్. ఇక అదే సమయంలో చంద్రబాబును ఎలాగైనా సరే ఓడించాలని మరింత పట్టుదలతో ఉన్నాడు. ఈసారి చంద్రబాబుని ఓడిస్తే ఇక తనకు తిరుగుండదు అని భావిస్తున్నాడు. అందుకే చంద్రబాబు మీద విశాల్ ను నిలబెట్టడం ఖాయమని అందుకు విశాల్ ఒప్పుకోకపోయినా ….. జగన్ ఒప్పిస్తాడని భావిస్తున్నారు.