
ఈరోజు జరిగిన ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా జగన్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు షాకిచ్చారు. ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 22 మంది శాసన సభ్యులను ఏర్పాటు చేసి ఆ 22 మందికి ఒక ఇంచార్జ్ ను నియమించాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఏకంగా 23 ఓట్లు వచ్చాయి. దాంతో జగన్ కు షాకిచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు ? అనే చర్చ జరుగుతోంది.
అయితే క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్యేల లిస్ట్ చూస్తే ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు షాకిచ్చే లిస్ట్ లో కనబడుతున్నారు. ఆ లిస్ట్ ప్రకారం చూస్తే నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి , కృష్ణా జిల్లాకు చెందిన వసంత కృష్ణప్రసాద్ , కోన రఘుపతి , ఉండవల్లి శ్రీదేవి తదితరులను అనుమానితులుగా భావిస్తోంది అధికార వైసీపీ. ఈ విషయం పై జగన్ అప్పుడే పోస్ట్ మార్టం చేస్తున్నాడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళను క్షమించే ప్రసక్తి లేదని ఆగ్రహంగా ఉన్నాడట జగన్.