మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిష్క్రమించిన రోజు సెప్టెంబర్ 2. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం ఇదే రోజున ముఖ్యమంత్రిగా రచ్చబండ అనే కార్యక్రమాన్ని చిత్తూర్ జిల్లాలో ప్రారంభించడానికి వెళ్లారు. క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా అలుముకోవడం వల్ల వైఎస్సార్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్ అయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు మహానేత వైఎస్సార్.
తెలుగు రాష్ట్రాలపై చెరగని ముద్ర వేసిన నాయకులలో మొట్టమొదటి వారు నందమూరి తారకరామారావు కాగా ఆ తర్వాతి స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. పేద ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అందించిన మహనీయులు ఎన్టీఆర్ , వైఎస్సార్ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
వైఎస్సార్ మరణ వార్త తెలిసిన వెంటనే వందలాది గుండెలు ఆగాయంటే ప్రజలపై ఎలాంటి ముద్ర వేసారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. వైఎస్సార్ 2009 లో మరణించినప్పటికీ ఇప్పటికి కూడా ఆ మహానేతను తల్చుకుంటూ తమ గుండెల్లో దేవుడిగా కొలిచే జనాలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు సుమా !