
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత , ప్రముఖ నిర్మాత చెరుకూరి రామోజీరావు పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. రామోజీరావు మార్గదర్శి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావు పైన పెద్ద యుద్ధమే చేసాడు. మార్గదర్శిలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని అయితే అయన వల్ల ఏమి కాలేకపోయింది.
1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసులు నమోదు అయ్యాయి. మార్గదర్శిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని రామోజీరావు , ఆయన కోడలు శైలజ మీద పలు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల మీద దర్యాప్తు చేసిన ఏపీ సీఐడీ అధికారులు సెక్షన్ 120 బి , 409 , 420 , 477 (a ) రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. అలాగే సెక్షన్ 5 , ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ , ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం కింద కేసు నమోదు చేస్తూ ఏ 1 గా చెరుకూరి రామోజీరావు , ఏ 2 గా చెరుకూరి శైలజ , ఏ 3 గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదయ్యాయి.