
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావును మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసేంత వరకు ఉద్యమాలు , ధర్నాలు చేస్తూనే ఉంటామని సంచలన వ్యాఖ్యలు చేసాడు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని విచారణకు రావాలని కవిత ను ఈడీ ఆదేశిస్తే తెలంగాణ తలవంచదని అంటున్నారు మరి TSPSC వ్యవహారంలో పరీక్ష పేపర్ లు లీక్ అయిన విషయంలో మాత్రం ఐటీ శాఖా మంత్రివైన నీకు సంబంధం లేదని అంటున్నావ్ ? ఇట్లా మాట్లాడటానికి సిగ్గుండాలి కేటీఆర్ అంటూ తీవ్ర విమర్శలు చేసాడు బండి సంజయ్.
మీకు కష్టం వస్తే …… తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ……. తెలంగాణ లోని ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే మాత్రం అస్సలు పట్టించుకోరు అంటే కవిత ఒక్కతే తెలంగాణ ఆడబిడ్డనా? మిగతావాళ్ళు కాదా ? అంటూ నిప్పులు చెరిగాడు బండి. TSPSC వ్యవహారంలో కేటీఆర్ పీఏ కు హస్తం ఉంది. ఈ స్కామ్ లో పెద్ద తలకాయలు ఉన్నాయి వాళ్ళందరినీ బయటకు లాగేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని , అందుకు కారకుడైన ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాల్సిందే అంటూ బండి సంజయ్ డిమాండ్ చేసాడు.






