
2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులులు చేసుకున్న చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలతో మోడీ తీరును ఎండగట్టారు.. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 23 సీట్లకే టీడీపీ పరిమితమయింది. ఎన్నికల తర్వాత బీజేపీ దగ్గర కావాలి టీడీపీ ఎంత ప్రయత్నం చేసిన బీజేపీ టీడీపీతో అంటీముట్టనట్టు గానే వ్యవహరిస్తోంది.
బీజేపీతో పొత్తు లేకపోయినా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలిపింది.. 2019 సొంతంగా 303 సీట్లు సాధించిన బీజేపీకి ఇప్పుడు అన్ని సీట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు.. జగన్ అధికారంలోకి వస్తే జగన్ కు వచ్చే ఎంపీ సీట్ల తో తమకు మద్దతు దక్కుతుంది అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
ఇప్పటికే వస్తే నితీష్ కుమార్, మమతా బెనర్జీ లాంటి నాయకులు బీజేపీ గెలవకూడదు అని విపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు. 2024 చంద్రబాబు గెలిస్తే వాళ్లకు తోడు అయ్యే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. అందుకోసం జగన్ గెలవడం కోసం ఎం సహాయం కావాలన్నా చేస్తామని మేము అండగా ఉంటామని బీజేపీ పెద్దలు జగన్ కు చెప్పినట్లు వినికిడి.






