
డాక్టర్ తాటికొండ రాజయ్య భోరున విలపించాడు. 63 ఏళ్ల వయసులో నాపై లైంగిక ఆరోపణలు చేయిస్తున్నారని , కూతురు వయసున్న ఆమెతో ఆరోపణలు చేయించారని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ఎమ్మెల్యే రాజయ్య ఏడుస్తుంటే ఒక్కసారిగా షాక్ కి గురైన ప్రజలు , సన్నిహితులు ఆయన్ని ఓదార్చారు. ఈ సంఘటన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో జరిగింది.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన డాక్టర్ తాటికొండ రాజయ్య మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. అయితే తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెరాస లో చేరాడు. ఉప ఎన్నిక వస్తే పోటీ చేసి విజయం సాధించాడు కూడా. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాడు.
అయితే 8 నెలలు కూడా తిరక్కుండానే అవినీతి ఆరోపణల మీద రాజయ్యను మంత్రివర్గం నుండి తొలగించాడు కేసీఆర్. ఇక అప్పటి నుండి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. గత ఎన్నికల సమయంలో రాజయ్య మీద లైంగిక ఆరోపణలు వచ్చాయి. అయినా అప్పుడు కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వకుండా మళ్ళీ రాజయ్యకె ఇచ్చాడు కేసీఆర్. రాజయ్య మళ్ళీ గెలిచాడు. ఇక కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి లైంగిక ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దాంతో గులాబీ అధినేత సీరియస్ అయ్యాడట. ఇంకేముంది తనపై ఆరోపణలు చేసిన నవ్య ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఇక ఈరోజు భోరున విలపించాడు…… లైంగిక ఆరోపణలు చేస్తున్నారని …. రాజకీయంగా దెబ్బ కొడుతున్నారని.