
తెలంగాణ రాస్ట్రానికి చెందిన అధికార BRS పార్టీకి చెందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈమధ్య కాలంలో ఎక్కువగా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉంటున్నాడు దాంతో హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కంటే ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవాడు.
కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎక్కువగా ఈ ఎమ్మెల్యే మహారాష్ట్ర లో ఉంటున్నాడు. అదేంటి ….. హైదరాబాద్ ను వదిలేసి మహారాష్ట్రలో ఎందుకు ఉంటున్నాడు అనే కదా మీ డౌట్ ? అసలు విషయం ఏంటంటే …… తెలంగాణ రాష్ట్ర సమితి ( TRS ) కాస్త భారత్ రాష్ట్ర సమితి ( BRS ) గా మారింది. దాంతో ఆ పార్టీని ఇతర రాష్ట్రాలలో కూడా బలోపేతం అయ్యేలా చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు దగ్గరగా మహారాష్ట్ర ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర లో BRS పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈనెల 26 న కేసీఆర్ పర్యటన ఉంది మహారాష్ట్రలో దాంతో అక్కడే ఉండి జీవన్ రెడ్డి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. అదన్న మాట అసలు సంగతి.