
#byebyejaganin2024 అనే ట్యాగ్ లైన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా ? ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి దిమ్మ తిరిగేలా ఫలితాలు రావడమే. ఏపీలోని పట్టభద్రులు జగన్ సర్కారుకు గట్టి షాక్ ఇచ్చారు. ఏపీ లోని మొత్తం 9 జిల్లాలో 100 కు పైగా నియోజకవర్గాలలోని పట్టభద్రులు జగన్ సర్కారుకు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని ఈ ఓట్లు తెలియజేస్తున్నాయి.
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉండగా అందులో 153 స్థానాలు గెలిచి ప్రభంజనం సృష్టించాడు జగన్. ఇక ఈసారి 175 అసెంబ్లీ స్థానాలకు గాను 175 స్థానాలు గెలవాల్సిందే అంటూ నాయకులను సమాయత్తం చేస్తున్నాడు. మనం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి తప్పకుండా 175 స్థానాలు గెలవాల్సిందే ….. వై నాట్….. అంటూ ఒత్తిడి కూడా చేస్తున్నాడు.
సరిగ్గా ఇదే సమయంలో ఏపీలో టీచర్స్ , స్థానిక సంస్థల , పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా స్థానిక సంస్థలలో వైసీపీకి మెజార్టీ ఉండటంతో ఆ స్థానాలను పూర్తిగా గెలుచుకుంది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో నామమాత్రపు మెజారిటీతో విజయం సాధించింది అధికార వైసీపీ. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల విషయానికి వచ్చేసరికి గట్టి షాకిచ్చారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించడమే కాకుండా మిగతా స్థానాల్లో కూడా గట్టి పోటీ నిచ్చారు. దాంతో 2024 ఎన్నికల్లో జగన్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని భావిస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ అభిమానులు బై బై జగన్ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.