
pavan chandrababuఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం బాబు నివాసంలో భేటీ అయ్యారు. బాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అరగంట పాటు చర్చలు జరిపినట్లు సమాచారం.
2019లో విడిపోయిన ఇటీవల తెలుగుదేశం, జనసేన బంధం ఇటీవల బలపడుతుంది. వీరిద్దరు ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. ఇటీవల చంద్రబాబు బీజేపీతో సైతం పొత్తుకు సిద్దపడడం… ఆ తర్వాత బీజేపీ నుంచి ఎలాంటి ఖండన లేకపోవడం.. సీఎం రమేష్ కుడా రాబోయేది బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వమే అనడం మరింత బలం చేకూరుతుంది. ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత వీరిద్దరి భేటీ జరగడం మరింత ఆసక్తి రేపుతోంది.
చంద్రబాబు-పవన్ భేటీపై అటు టీడీపీలో కానీ.. ఇటు జనసేనలో కానీ ఏ ఒక్కరికీ సమాచారం లేకపోవడం గమనార్హం. అయితే ముచ్చటగా మూడోసారి జరిగిన ఈ భేటీపై ఇరుపార్టీల కీలక నేతలకూ ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలేం జరుగుతోందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో రెండ్రోజుల పాటు పర్యటించిన పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. ఆ మధ్యే పవన్-బాబు భేటీ ఉంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. ఇప్పుడు సడన్‌గా సమావేశం కావడం, అది కూడా పవనే స్వయంగా బాబు ఇంటికెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.
ఈ అరగంటపాటు జరిగిన భేటీలో టీడీపీ-జనసేన పొత్తులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. టీడీపీ-జనసేన కలిసే పొత్తుతోనే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాయని అధికార పార్టీ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తోంది. వాస్తవానికి బీజేపీతో మిత్రబంధం కొనసాగిస్తున్న పవన్.. ఈ మధ్య బీజేపీ నాయకులను కలిసన సందర్బాలు లేవు.. రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలు అంతకన్నా లేవు… పైగా బీజేపీ నేతలు బహిరంగంగానే పవన్‌తో మాకేంటి..? మేం ఒంటరిగానే పార్టీని బలోపేతం చేసుకుంటామని చెప్పుకుంటున్నారు. అటు పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత.. ఇటు మోదీ గురించి చంద్రబాబు ఇలా మాట్లాడిన రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరి భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరు పొత్తులపై ఒక నిర్ణయానికి వచ్చారని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు. ఇరు పార్టీల నేతలు… ఈ భేటీకి వెనుక ఏం జరిగిందో తెలియాలంటే టీడీపీ, జనసేన నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి..!






