AP CM ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం ఒక ప్రత్యేక సెక్యూరిటీ సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇందులో 50 నుంచి 100 మంది వరకు ఉంటారని, వారంతా మహిళలేనని తెలుస్తున్నది. వీరికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నదని, త్వరలోనే వీరంతా విధుల్లో చేరుతారని సమాచారం.
అయితే గతంలో కల్నల్ గడాఫీ రక్షణకు ప్రత్యేకంగా ఇలాగే ఒక మహిళల టీం ఉండేదని పుస్తకాల్లో చదువుకున్నాం. ప్రస్తుత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా ఇలాంటి టీం ని ఏర్పాటు చేసుకున్నాడని సమాచారం. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం వచ్చేసింది. జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. ఆ తర్వాత వాటిని నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఆయనపై ఉంది.
ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం మరోసారి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అయితే ఈసారి మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఒక ఉమెన్స్ సెక్యూరిటీ టీం ను సిద్ధం చేశారని తెలుస్తున్నది. పారిశుద్ధ్య కార్మికుల నుంచి మొదలుకొని అంగన్వాడీ కార్యకర్తల వరకు అందరూ జగన్ కు శాపనార్ధాలే పెడుతున్నారు. అందుకే ఒక మహిళల సెక్యూరిటీ ఫోర్స్ ఉంటే వీరి నిరసనల నుంచి తప్పించుకోవచ్చని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్లలో నేరుగా ప్రజలను కలిసింది లేదు. కేవలం బహిరంగ సభల్లో మాట్లాడడమే తప్ప క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఎక్కడా పర్యటించలేదు. సమస్యలు వినలేదు. మీడియాతో మాట్లాడలేదు. తాడేపల్లి లో ఉంటూ విపక్షాల మీద కుట్రలు చేయడానికి పరిమితం అయ్యారని అపవాదు మూటగట్టుకున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాల్సి రావడం మహిళల నుంచి నిరసనలు వ్యక్తం అయితే అడ్డుకునేందుకు ఒక ప్రత్యేక ఉమెన్స్ టీం ను సిద్ధం చేయాలని ఆదేశాలు రాష్ట్ర పోలీసులకు వచ్చాయని సమాచారం.
ReplyForward
|