
Communists : కమ్యూనిస్ట్ లు తమ పంతా మార్చుకుంటారా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కర్ణాటక ఫలితాలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ తో కలవాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ వారిని ఆదరిస్తుందా అంటే సందేహమే అని చెప్పకతప్పదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ లను ఎప్పుడూ తనతో పొత్తులకు ఆహ్వానించేది కాంగ్రెస్సే. బీజేపీతో కమ్యూనిస్టులు కలిసి పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. ఇక కర్ణాటక ఫలితాలు కూడా కాంగ్రెస్ కు బాగానే మేలు చేశాయనే చెప్పవచ్చు. బీజేపీ కూడా అక్కడ అంత పెద్ద మెజారిటీగా కాంగ్రెస్ గెలుస్తుందని ఊహించలేదు. ప్రభుత్వ బదిలాయింపు కామనే అనుకుంటూనే ఓటు బ్యాంకును కాపాడుకోవాలని కష్టపడింది బీజేపీ. కానీ అంచనాలకు మించి ఫలితాలు రావడంతో బీజేపీ అస్సలు ఓటు బ్యాంకు ఎటు వెళ్లిందంటూ ఇప్పుడు పార్టీ సందేహంలో పడింది. ఇది ఏ రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూడానుకుంటుంది.
ఇక కమ్యూనిస్ట్ లను బుట్టలో వేసుకున్న కేసీఆర్ పొత్తులు పెట్టుకుని కమ్యూనిస్టులను తన పార్టీలో కలిపేసుకున్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో దేశం మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నా.. కమ్యూనిస్టులు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉంటారని కమ్యూనిస్ట్ పార్టీల అధినేతలు చెప్పుకచ్చారు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ భగ్గుమంది. అయితే కమ్యునిస్ట్ లకు కేసీర్ రాజకీయం గురించి కొంచెం కొంచెంగా తెలిసి వచ్చింది. అవసరం ఉన్నప్పుడు బుజంపై ఎక్కించుకున్న కేసీఆర్ అవసరం తీరగానే పాతాళంలోకి నెడతారని గ్రహించారు. థర్డ్ ఫ్రంట్ ఐడియా వచ్చిన తర్వాత కేసీఆర్ కమ్యూనిస్ట్ పార్టీలను కూడా తన ఫ్రంట్ లో కలుపుకోవాలని భావించారు. ప్రస్తుతం తమ ఉనికికి పెద్ద ప్రమాదం పొంచి ఉండడంతో కమ్యూనిస్ట్ లు రియాక్ట్ అవుతున్నారు.
ఇటీవల ఒక సందర్భంలో సీపీఐ నేత నారాయణ కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో సీట్ల గురించి ఇంత వరకూ క్లారిటీ ఇవ్వడం లేదనీ, తాము రాజకీయ సన్యాసం తీసుకోలేదని తమకూ పాలిటిక్స్ తెలుసని అన్నారు. అయితే ఈ మధ్యవారి చూపు కాంగ్రెస్ పై పడింది. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్సే నూరు పాళ్లు మేలని అనుకుంటున్నారు. ఇటీవల కర్ణాటకలో కూడా భారీ మెజారిటీ సాధించి దక్షిణాన ఒక రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ మంచి ఊపుమీద ఉందని లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కూడా దీనికి ఒకే చెప్పేలా ఉంది. అయితే వారు అడిగే సీట్ల గురించి మొదట ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.