
Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బెదిరింపు లేఖ వచ్చింది. మోడీ ఈనెల 24న కేరళలో పర్యటించొద్దని ఆ లేఖ ద్వారాహెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మలయాళంలో వచ్చిన ఈ లేఖ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కేరళలోని ఎర్నాకులానికి చెందిన నడుముత్తమిల్ అనే వ్యక్తి పేరు మీద ఈ లేఖ బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చినట్లు పోలీసులు,స్థానిక పార్టీ కార్యకర్తలు గుర్తించారు.
మరోవైపు పీఎం మోడీకి బెదిరింపు లేఖ నేపథ్యంలో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీశారు.ఈ లేఖ ఈనెల 17నే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరినట్లు పోలీసులు తేల్చారు. లేఖను రాసిన నడుముత్తమిల్ ను అదుపులోకి తీసుకున్న ఖాకీలు అతన్ని విచారించగా..ఆ లేఖను తాను రాయలేదని వెల్లడించారు. తన పేరుతో ఇతరులెవ్వరో లేఖను రాసినిట్లు స్పష్టం చేశారు. దీంతో బెదిరింపు లేఖలో ఉగ్రవాద హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.






