36.5 C
India
Friday, April 10, 2026
More

    మచిలీపట్నాన్ని హోల్ సేల్‌గా లూటీ చేసే కుట్ర: పేర్ని నానిపై కొల్లు రవీంద్ర పైర్

    Date:

    Kollu_Ravindra
    Kollu_Ravindra
    ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల  మంత్రి అదిమలుపు సురేష్ వర్సెస్ చంద్రబాబు నాయుడుగా పేలిన మాటల తూటాలు…ఇప్పుడు తాజాగా మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిని టార్గెట్ చేశారు. మచిలీపట్నాన్ని పేర్ని నాని హోల్ సేల్ గా లూటీ చేయడానికి కుట్ర చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
    వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టిడిపి హయాంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడాను ఏర్పాటు చేశామని పేర్కొన్న కొల్లు రవీంద్ర, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
    ఇటీవల ముడా అధికారులు తయారుచేసిన మాస్టర్ ప్లాన్ అంతా లోపభూయిష్టంగా ఉందని, అనేక తప్పులు దొర్లాయన్నారు.ప్రైవేటు ఆస్తులను దోచుకునే లాగా మాస్టర్ ప్లాన్ ను తయారు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి అవసరాలను మాస్టర్ ప్లాన్ లో ఏవిధంగా తీరుస్తారో చెప్పలేదని, గుడిని , బడిని కూడా దోచుకునేలా తయారుచేసిన మాస్టర్ ప్లాన్ పై ప్రజలు స్పందించాలన్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి తప్పుల తడకగా ఉన్న మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Perni Nani : పేర్ని నాని అండ్ ఫ్యామిలీ కనిపించుట లేదు !

    Perni Nani Family : పేర్ని నాని కుటుంబంతో సహా కనిపించకుండా పోయారు....

    Perni Nani : వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్..

    క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్న సర్కార్ Perni Nani : వైసీపీ నేత,...

    Volunteers Resignations : వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు.. ఎందుకంటే..?

    Volunteers Resignations : రాష్ట్రంలో వాలంటీర్లు మాకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్ల...

    Pawan Kalyan Vs Perni Nani : పవన్ కళ్యాణ్ కు చెప్పులు చూపించిన పేర్నినాని.. ఏపీ షాక్..

    Pawan Kalyan : వైసీపీ నేత పేర్ని నాని జనసేన అధినేత...