36.5 C
India
Friday, April 10, 2026
More

    డీఎస్ కుటుంబంలో చిచ్చు : నిన్న చేరి ఈరోజు రాజీనామా

    Date:

    dharmapuri srinivas son sanjay allegations on mp aravind
    dharmapuri srinivas son sanjay allegations on mp aravind

    డీఎస్ కుటుంబంలో చిచ్చు చెలరేగింది దాంతో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు అనూహ్యంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో సంచలనంగా మారింది ఈ విషయం. నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగాడు. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రపద్రేశ్ కు పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసి మరోసారి పార్టీకి అధికారం దక్కేలా చేసాడు.

    కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీఎస్ ప్రాధాన్యం తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి కేసీఆర్ పంచన చేరి గులాబీ కండువా కప్పుకున్నాడు. దాంతో రాజ్యసభ సభ్యత్వం పొందాడు. అయితే 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ ధర్మపురి శ్రీనివాస్ ను దూరం పెట్టాడు. ఇక ఇదే సమయంలో డీఎస్ మరో కొడుకు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా బీజేపీ నుండి పోటీ చేసి కేసీఆర్ కూతురు కవిత పై సంచలన విజయం సాధించాడు.

    ఇక అప్పటి నుండి డీఎస్ ఇంట్లో రాజకీయ రచ్చ మొదలైంది. మొదట నుండి ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ వాది. అలాగే తన మరో కొడుకు ధర్మపురి సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు. దాంతో తండ్రీ కొడుకులు కాంగ్రెస్ పార్టీలో అరవింద్ బీజేపీలో ఉండటంతో రాజకీయ రచ్చ మొదలైంది. కట్ చేస్తే నిన్న డి. శ్రీనివాస్ , సంజయ్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసాడు డి. శ్రీనివాస్. దాంతో ఎంపీ అరవింద్ మానాన్న చేత బలవంతంగా  రాజీనామా చేయించాడని, అసలే ఆయన ఆరోగ్యం బాగోలేదని ఇలాంటి సమయంలో  బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి ధర్మపురి శ్రీనివాస్ ఇంట రాజకీయం రసవత్తరంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related