భారత వజ్రోత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయులు , ముఖ్యంగా తెలుగువాళ్ళు భారత 75 వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల సాయి దత్త పీఠం లో భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో ఎడిసన్ మేయర్ , కౌన్సిల్ మెంబర్స్ , JSW & Jai swaraajya అధినేత జగదీశ్ యలమంచిలి , NJ చైర్మన్ ఉపేంద్ర చివుకుల , JSW & Jai Swaraajya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ , రఘు శర్మ కారుమంచి లతో పాటుగా పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి , జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్
Breaking News