20.2 C
India
Monday, December 5, 2022
More

  NTR:ఎన్టీఆర్ ని పిలవడంలో రాజకీయమే కారణమా ?

  Date:

  ntr-is-politics-the-reason-for-calling-ntr
  ntr-is-politics-the-reason-for-calling-ntr

  ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు ముగ్దుడై అమిత్ షా ఎన్టీఆర్ ని పిలిపించుకున్నారు ……. అభినందించారు అంటూ బీజేపీ శ్రేణులు చెబుతున్నప్పటికీ అది మాత్రం వాస్తవం కాదని తెలుస్తోంది ఎందుకంటే ….. దీని వెనుక పెద్ద రాజకీయమే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించాడు. అలాగే చరణ్ నటనకు కూడా ప్రేక్షకులు ముగ్దులయ్యారు.

  పైగా అల్లూరి సీతారామరాజు గెటప్ లో అద్భుతంగా ఉన్నాడు చరణ్. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కంటే చరణ్ పాత్రకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. అంతేకాదు దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా నటించాడు చరణ్. ఇక ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించాడు. తమ గూడెం కు చెందిన అమ్మాయిని బ్రిటీష్ వాళ్ళు తీసుకెళితే ఆ అమ్మాయిని కాపాడటానికి ఎన్టీఆర్ వెళ్తాడు.

  ఇక ఇలాంటి గొప్ప సినిమాని తీసింది దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ చిత్రం చూసే అమిత్ షా ఎన్టీఆర్ ని పిలిస్తే తప్పకుండా దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళిని అలాగే హీరో చరణ్ ని కూడా ఆహ్వానించాలి. కానీ అలా జరగలేదు. అంటే తప్పకుండా ఎన్టీఆర్ ని బీజేపీ లోకి ఆహ్వానించడానికి మాత్రమే అమిత్ షా పిలిచాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మరో ఏడాదిన్నర కూడా లేదు ఎన్నికలకు. దాంతో ఎన్టీఆర్ సేవలు వినియోగించుకోవడానికే ఇలా చేసాడని , అమిత్ షా మాస్టర్ ప్లాన్ లో భాగంగానే ఈ భేటీ అని అర్ధం అవుతోంది.

  అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా 2024 లో ఎన్నికలు రానున్నాయి. దాంతో ఎన్టీఆర్ బీజేపీ కి మద్దతుగా నిలిస్తే తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి లాభం జరుగుతుందని , ఏపీ లో అధికారంలోకి రాకపోయినా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందని , ఇక తెలంగాణలో తప్పకుండా అధికారం చేపట్టొచ్చని భావిస్తున్నారట. అందుకే ఎన్టీఆర్ తో భేటీ అయినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

  Share post:

  More like this
  Related

  50 రోజులు పూర్తి చేసుకున్న కాంతార

  kantara completes 50 daysచిన్న చిత్రంగా వచ్చిన కనడ చిత్రం'' కాంతార...

  బ్రేకింగ్ : విజయ్ సేతుపతి షూటింగ్ లో ప్రమాదం

  తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న '' విడుదలై ''...

  100 కోట్ల ఆస్థి పోగొట్టుకున్నానంటూ బోరుమన్న చంద్రమోహన్

  శోభన్ బాబు ఎంత చెబుతున్నా వినకుండా హైదరాబాద్ , చెన్నై లలో...

  ప్రభాస్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా

  pawan kalyan green signal to young director sujit పవర్ స్టార్...

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  గుజరాత్ అసెంబ్లీకి మొదలైన పోలింగ్

  ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా ల సొంత రాష్ట్రమైన...

  మళ్లీ విడుదల అవుతున్న మాయాబజార్

  తెలుగు తెర ఇలవేల్పులు అయిన ఎన్టీఆర్ , అక్కినేని , ఎస్వీ...

  ఎన్టీఆర్ సినిమాను కొట్టేసిన చరణ్ ?

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాను కొట్టేసాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్...

  Celebs pay homage to Superstar Krishna