
Ponguleti comments : బీఆర్ఎస్ సస్పెన్స్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ నెలకొంది. గతంలో బీఆర్ఎస్ లో పని చేసిన ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో బీజేపీలోకి వస్తారని, చర్చలు పొంగులేటితో చర్చలు కొనసాగుతున్నాయని వార్తలు వినిపించాయి. అయితే అందులో ఏ మాత్రం నిజంలేదని శ్రీనివాస్ రెడ్డి కొట్టి పడేశారు. అయితే ఇంకా ఏ పార్టీలోకి వెళ్లాలని స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. నా కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడతానని, వారితో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు.
‘మార్నింగ్ విత్ మల్లన్న’ షోలో పాల్గొన్న ఆయన కాసేపు మల్లన్నతో ముచ్చటించారు. తాను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని, తన తర్వాతి స్టెప్ గురించి అభిమానులు, కార్యకర్తల్లో గందరగోళం ఉందన్న మాటనిజమే. కానీ చర్చల అనంతరమే స్పష్టంగా తెలిపే ఆస్కారం ఉందని ఆయన తెలిపారు. మరోసారి తప్పటడుగు వేయద్దనే అందుకు సిద్దంగాలేనని చెప్పుకచ్చారు. వీటన్నింటిని పరిశీలించి దాదాపు జూన్ 15 నాటికి తన రాజకీయ పరిణామాలపై ఫైనల్ చేస్తనని చెప్పారు. ఆ సమయంలోనే అనౌన్స్ కూడా ఉంటుందన్నారు. ఇతర పార్టీలో చేరాలా..? లేక సొంత కుంపటి పెట్టుకోవాలా..? అన్నదానిపై స్పష్టమైన ప్రకటన ఉంటుందన్నారు.
అయితే కేసీఆర్ సొల్లు మాట్లాడుతున్నారని, ఆయన మాటలకు కాలం చెల్లిందన్నారు. ఇప్పటికే రెండు సార్లు మభ్యపెట్టిన ముఖ్యమంత్రి మళ్లీ మూడో సారి పీటం కోసం చూస్తున్నారని ఇది సాధ్యం కాదన్నారు. మొదట్లో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని. దానికి తగ్గట్లుచర్చలు కూడా జరిగినట్లు పొంగులేటి చెప్పారు. కానీ కర్ణాటక ఫలితాల నేపథ్యంలో మరింత లోతుగా ఆలోచిస్తున్నట్లు చెప్పుకచ్చారు. ఏ పార్టీలో ఉన్నా స్థానిక సమస్యలు, కష్టాలు తెలుసునని, వాటి నివారణకు కష్టించి పడి చేస్తానన్నారు.