
తెలంగాణ ముఖ్యమంత్రి , BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తాజా సర్వే షాకిచ్చిందట. కేసీఆర్ ప్రతీ మూడు నెలలకు ఒకసారి తన పార్టీ పనితీరు మీద అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు , ఎమ్మెల్సీలు , ఎంపీల పని తీరు మీద సర్వేలు చేయిస్తుంటారు. అందులో భాగంగానే తాజాగా కేసీఆర్ చేతికి ఓ సర్వే అందిందట. ఆ సర్వే చూసి షాక్ అయిన అధినేత దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాడు. ఇంతకీ కేసీఆర్ ను షాక్ అయ్యేలా చేసిన ఆ సర్వే ఫలితాలు ఎలా ఉన్మాయో తెలుసా…….
22 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందట. 22 మంది కంటే ఎక్కువ ఎమ్మెల్యే ల పని తీరు బాగోలేదు కానీ 22 మంది ఎమ్మెల్యేల పని తీరు అయితే మరీ దారుణంగా ఉందట.
ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలో ఈ 22 మంది ఎమ్మెల్యేలు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటూ వాటాలు తీసుకుంటున్నారట. దళితబంధు తో పాటుగా పలు కాట్రాంక్ట్ పనులలో వాటాలు యథేచ్ఛగా తీసుకుంటున్నట్లు తెలిసి షాక్ అయ్యాడట.
ఇప్పుడు గులాబీ పార్టీకి మొత్తంగా 103 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే ఇందులో 26 నుండి 30 మంది మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని తెలుస్తోందట. దాంతో వాళ్ళను ఏం చేయాలి……. అనే టెన్షన్ లో ఉన్నాడట కేసీఆర్. గతంలో టికెట్లన్నీ సిట్టింగ్ లకు మాత్రమే అని చెప్పి తీరా ఎన్నికల సమయానికి కొంతమందికి టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా అదే పని చేయనున్నాడని సమాచారం. తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది డిసెంబర్ లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. దాంతో తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది.