KTR Padhayatra: మాజీ మంత్రి కేటీఆర్ త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నానని ప్రకటించారు. ఇది కేవలం పార్టీ శ్రేణుల అభిప్రాయమని కార్యకర్తల ఇష్టంతోనే తాను పాదయాత్ర ప్రారంభించబోతున్నానని ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది. గతంలో పాదయాత్ర చేసే వారిపై కేటీఆర్ విమర్శలు చేశారు. ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. పాదయాత్ర ఎందుకు దేనికోసం చేస్తున్నారు. అవసరమా అంటూ కాంగ్రెస్ నేతలు బట్టి విక్రమార్క పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇంత అభివృద్ధి చేస్తుంటే పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నారు. అంటూ తిట్టారు. ప్రస్తుతం కేటీఆర్ కూడా తాను పాదయాత్ర చేస్తున్నానని ప్రకటించడంతో గతంలో ఆయన మాట్లాడిన మాటలను ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను కలిపి సోషల్ మీడియాలో ఎడిట్ చేసి పెడుతున్నారు. తమకు అధికారం ఉంటే ఒక మాట అధికారం లేకపోతే మరో మాట మాట్లాడతారని ఇది రాజకీయ నాయకుల నైజం అంటూ విమర్శిస్తున్నారు.
అయినప్పటికీ కేటీఆర్ పాదయాత్ర చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సక్సెస్ అయ్యారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర ఆయనను సీఎంగా చేసింది. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ ఇలా ఎవరు పాదయాత్ర చేసిన వారు సీఎం అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో రాబోయే కాలంలో బిఆర్ఎస్ తరఫున సీఎం కాండిడేట్ కేటీఆర్ అని స్పష్టంగా అర్థం అవుతుంది.
దీంతో హరీష్ రావు, కవిత ఇద్దరు పక్కకు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. ఈ పాదయాత్ర మరి సక్సెస్ అవుతుందా ప్రజలు ఆదరిస్తారా.. కాంగ్రెస్ నాలుగేళ్ల పాలన ఇంకా మిగిలి ఉండగా ముందుగానే పాదయాత్ర చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కేటీఆర్ ఆలోచించుకోవాలని కొంతమంది రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు.