Nara Lokesh – KTR : చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్తాయిలో ఉద్యమిస్తున్నారు నారా లోకేష్. తండ్రి అరెస్ట్ పై తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో లోకేష్ భేటీ అయ్యారు. లోకేష్ వెంట కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల వంటి టీడీపీ ఎంపీలు ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన లోకేష్, ఎంపీలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సైతం నారా లోకేష్ ఫోన్ చేసినట్టు సమాచారం. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో రెండు రాజకీయ పార్టీల అంశంలా ఉన్నట్టు తెలుస్తోంది. నేను వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, నారా లోకేష్ కు మిత్రున్ని అని.. బాబు అంశం కోర్టులో ఉంది దీని గురించి మాకు అనవసరం అని కేటీఆర్ అన్నట్టు తెలిసింది. లోకేష్ నాకు కాల్ చేసి ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదు అని అడిగారని… ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దు.. ఎవరికి అనుమతి ఇవ్వం అని చెప్పానని వివరించారు.
ఇది రెండు రాజకీయ పార్టీల ఘర్షణ అని.. ప్రశాతంగా ఉన్న ఐటీ డిస్టర్బ్ కావొద్దన్నదే తన అభిమతం అని మంత్రి కేటీఆర్ సూటిగా లోకేష్ కు బదులు ఇచ్చినట్టు తెలుస్తోంది.