జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్ ఓ మహిళపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆ మహిళ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాగంటి గోపీనాథ్ దగ్గర పనిచేసే విజయ్ సింహకు నేర చరిత్ర కూడా ఉందట. సోషల్ మీడియాలో ఓ మహిళకు పరిచయమయ్యాడు విజయ్ సింహా.
ఆ పరిచయం కాస్త ఎక్కవ కావడంతో నెంబర్లు షేర్ చేసుకొని ఫోన్ లు మాట్లాడుకునే స్థాయికి వచ్చారు. ఆ తర్వాత సదరు మహిళకు న్యూడ్ కాల్స్ కూడా చేయడం మొదలు పెట్టాడట. దాంతో ఆమె కాస్త అవాయిడ్ చేసింది. ఇక నిన్న సదరు మహిళ ఇంటి అడ్రస్ కనుక్కుని ఏకంగా ఇంటికే వచ్చి ఆ మహిళతో గొడవ పడటమే కాకుండా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆమె భర్త ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.