
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధికి ఓటు వేయాల్సిందిగా టీడీపీ నాకు 10 కోట్ల ఆఫర్ ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఉండి ఎమ్మెల్యే శివ రామరాజు నన్ను కలిసి ఈ విషయం గురించి మాట్లాడాడని , అయితే నేను వెంటనే అతడి మాటలను ఖండించానని స్పష్టం చేసాడు రాపాక.
ఇటీవలే ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అధికార వైసీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాడటంతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించింది. దాంతో అధికార వైసీపీ తీవ్ర అవమానంగా భావిస్తోంది. మొత్తానికి అటు ఇటు తిరిగి ఎమ్మెల్సీ ఎన్నిక ఎమ్మెల్యేల కొనుగోలు అంశంగా మారింది. జనసేన నుండి పోటీ చేసి విజయం సాధించిన రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇచ్చి జగన్ పంచన చేరాడు.
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలుగుదేశం పార్టీపై అలాగే ఉండి ఎమ్మెల్యే రామరాజు పై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. అయితే రాపాక వ్యాఖ్యలను ఖండిస్తునాడు ఎమ్మెల్యే రామరాజు. మేము మర్యాద పూర్వకంగా కలుసుకుంటాం తప్పితే మామధ్య ఓట్ల గురించి అలాగే డబ్బుల గురించి మాటే రాలేదని , మరి అలాంటప్పుడు రాపాక ఇలాంటి ఆరోపణలు ఎలా చేసాడో అర్ధం కావడం లేదని ఖండిస్తున్నాడు టీడీపీ ఎమ్మెల్యే రామరాజు.






