
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసులో అడుగుపెట్టింది ఎమ్మెల్సీ కవిత. తుగ్లక్ రోడ్డు లోని కేసీఆర్ అధికారిక నివాసం నుండి ప్రత్యేక వాహనంలో బయలుదేరింది కవిత. అయితే కవిత ఇంటి నుండి బయటకు వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు, నాయకులు కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కవిత వాహనానికి అడ్డుగా నిలిచారు. అయితే పోలీసులు వాళ్ళను చెదరగొట్టి కవిత వాహనం ముందుకు వెళ్లేలా చేశారు. దాంతో కవిత వాహనం ముందుకు కదిలింది. ఈడీ ఆఫీసుకు చేరుకున్న కవిత లోపలకు వెళ్లేముందు కార్యకర్తలకు , నాయకులకు అభివాదం చేసి లోపలకు వెళ్ళింది.