
Karnataka Elections 2023: రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులుండరు…పర్మినెంట్ మిత్రులుండరు. సమయం,కాలం,అవసరం, అవకాశాలే మిత్రులను శత్రువులుగా..శత్రువులను మిత్రులుగా మార్చుతుంటాయి. ఇప్పుడు కర్నాటక రాజకీయాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కర్నాటక పాలిట్రిక్స్‌లో మాజీ మంత్రి ఈశ్వరప్పది అందవేసిన చెయ్యి. మొన్నటి వరకు బీజేపీలో తిరుగులేని నేతగా ఉన్న ఈశ్వరప్ప..ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
అయితే తాను రాజకీయాల నుంచి క్విట్ అయినప్పటికీ..ఈ ఎలక్షన్స్‌లో తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానానికి ఈశ్వరప్ప మొర పెట్టుకున్నారు. కొడుకు కంటేశ్‌ను శివమొగ్గ నుంచి పోటీ చేయించాలని అనుకున్నారు. అయితే తానొకటి తలిస్తే అధిష్టానం పెద్దలు మరోటి తలచినట్లు ఈశ్వరప్పకే కాదు…అతని కుమారుడు కంటేశ్‌కు కూడా టికెట్ ఇచ్చిందేకు నిరాకరించారు. అంతేకాక ఆ సీట్‌ను చెన్నబసప్పకు కేటాయించి ఈశ్వరప్ప ఫ్యామిలీకి ఝలక్ ఇచ్చారు. ఇక ఇక్కడే అసలైన ట్విస్ట్ నెలకొంది. జనరల్‌గా ఎన్నికల వేళ ఏదైనా కీలక నేత లేదా అతని కుటుంబానికి బీ-ఫాం రాకపోతే ఇతర పార్టీలకు జంప్ కావడం పరిపాటి.
కానీ,ఈశ్వరప్ప తనకు టికెట్ ఇవ్వని బీజేపీకి షాక్ ఇచ్చే బదులు విపక్ష కాంగ్రెస్‌కు మింగుడు పడని స్టేట్‌మెంట్ ఇచ్చారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ..తన సపోర్ట్ మాత్రం బీజేపీకే ఉంటుందని కుండ బద్దలు కొట్టే ప్రకటన చేశారు. దీంతో ఈవిషయం కాస్తా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి వెళ్లడంతో ఆయనే నేరుగా ఈశ్వరప్పకు కాల్ చేసిన మెచ్చుకోవడం కర్నాటక రాజకీయాల్లో చర్చనీయాం శంగా మారింది. పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది..అధైర్య పడకండి అంటూ మోడీ భరోసానిచ్చారు. వాస్తవానికి బెలగావిలో చేపట్టిన పబ్లిక్ వర్క్స్‌లో ఈశ్వరప్ప 40 శాతం కమీషన్లు దండుకున్నారనే విమర్శలున్నాయి. ఈనేపథ్యంలోనే ఆయన తన పదవికి రిజైన్ చేయాల్సి వచ్చింది.
అయితే ఇలాంటి నాయకుడికి ఇప్పుడు ప్రధాని మోడీ నుంచి కాల్ రావడంపై కాంగ్రెస్,జేడీఎస్‌లు మండిపడుతున్నాయి. మోడీ నేరుగా అవినీతిని పెంచిపోషిస్తున్నారని విమర్శిస్తున్నాయి. అయితే విపక్షాల విమర్శలు ఎలా ఉన్న ఈశ్వరప్పకు మోడీ ఏమీ హామీ ఇచ్చి ఉంటారనే దానిపైనే ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏకాన లాభం లేనిదే ఏ పని చేయడు అనే పేరు ఈశ్వరప్పకు ఉంది. అలాంటి ఈశ్వరప్ప తన కుమారుడు కంటేశ్‌కు టికెట్ ఇవ్వాలని బీజేపీ పెద్దలను కోరినప్పటికీ వారి నుంచి స్పందన లేకపోయినప్పటికీ..ఎందుకు బీజేపీకి ఆయన మద్దతు ఇస్తున్నారనే వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రధాని మోడీ కాల్ చేసినంత మాత్రం ఈశ్వరప్పలో ఇలాంటి మార్పు వస్తుందని చెప్పలేనే డిస్కన్ బెంగళూరు,ఢిల్లీ రాజకీయ సర్కిల్స్‌లో జరుగుతోంది.






