Pawan రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు గానీ శాశ్వత శత్రువు కాని ఉండడు. పార్టీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ముందుకు వెళ్లడమే. ఇదే కోవలోకి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఏపీలో బాగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన వారాహి యాత్ర నిర్వహిస్తూ అందులో భాగంగా ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కు గురవుతూ మేయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు కని అందరి నోళ్లలో నానే పేరు మాత్రం పవన్ కళ్యాణ్.
జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని అన్ని కోణాల్లో తీవ్రంగా వ్యతిరేకించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఒక సభలో ‘చంద్రబాబు గారికి సిగ్గులేదా, శరం లేదా, వాళ్ల కాళ్లు ఎలా పట్టుకుంటావు’ అంటూ కామెంట్లు చేశాడు. తీవ్రంగా దుర్భషలాడాడు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు దోస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది పవన్ కళ్యాణ్ కు. పొత్తుల్లో భాగంగా లీడ్ లో ఉన్న పార్టీ టీడీపీ కాబట్టి వారితో స్నేహం చేయాల్సిందే అనుకున్నాడు పవన్ కళ్యాణ్.
దీంతో, రాష్ట్రం విడిపోయన సందర్భంలో పవన్ కళ్యాణ్ అన్నమాటలకు సంబంధించి రాంగోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అప్పుడు తిట్టిన పవన్ కళ్యాణ్ నేడు చంద్రబాబు కాళ్లు ఎలా పట్టుకుంటావు? అంటూ ప్రశ్నిస్తున్నట్లు ఉంది వీడియో. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు.
— Ram Gopal Varma (@RGVzoomin) July 18, 2023