
నటసింహం నందమూరి బాలకృష్ణ అధికార పార్టీ వైసీపీకి చెందిన నరసారావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. నేను ఒక్క చిటికేస్తే …… అంటూ నిప్పులు చెరిగాడు. బాలయ్యకు నర్సారావుపేట ఎమ్మెల్యే పై ఇంతగా కోపం ఎందుకు వచ్చిందో తెలుసా ……. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడట.
కాగా ఆ కార్యక్రమంలో బాలయ్య వీరాభిమాని భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి బాలయ్య పాట పెట్టాడట. అంతే …… ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డికి విపరీతమైన కోపం వచ్చిందట. బాలయ్య పాట పెడతావా ? అంటూ బాలయ్య అభిమాని మీద ఆగ్రహం వ్యక్తం చేసాడట…. అంతేకాదు ఆ పాటను ఆపేలా చేసాడట. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి బాలయ్య అభిమాని అయినప్పటికీ వైసీపీ కి హార్డ్ కోర్ కార్యకర్త అట.
అయితే ఈ విషయం బాలయ్య దృష్టికి వెళ్ళింది. ఇక ఈరోజు గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగగా ఆ వేడుకలకుహాజరయ్యాడు బాలయ్య. ఇంకేముంది బాలయ్య మాట్లాడుతున్న సమయంలో ఈ సంఘటన గుర్తుకు రావడంతో వైసీపీ ఎమ్మెల్యేకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దాంతో బాలయ్య అభిమానులు ఈలలతో గోల గోల చేసారు.