నారా బ్రాహ్మణి.. ఇప్పుడు ఏపీలో అటు చంద్రబాబు, ఇటు లోకేష్ బాబు స్వేచ్ఛగా.. ఏ చీకు చెంత లేకుండా తిరుగుతున్నారంటే దానికి కారణం కేవలం బ్రాహ్మణి మాత్రమే. ఈమె చంద్రబాబు హరిటేజ్ సహా అన్ని బిజినెస్ లను చాకచక్యంగా చూసుకోవడం వల్లనే చంద్రబాబు, లోకేష్ ప్రశాంతంగా రాజకీయం చేస్తున్నారు.లోకేష్ శక్తి సామర్థ్యాలపై చాలామందికి తక్కువ అంచనాలున్నా పాదయాత్రతో ఆయన మళ్లీ తన శక్తిని తిరిగి తెచ్చుకుంటున్నారు.
2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. జీవన్మరణ సమస్య లాంటి ఈ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే లోకేష్ ను పాదయాత్రకు పంపారు. దాదాపు 400 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. మరోవైపు చంద్రబాబు ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
ఇక ఇప్పటికే నుంచి ఎంపీ స్థానాలను ఖరారు చేయాలని.. బలమైన అభ్యర్థులను ఎంపీ బరిలో నిలపాలని చంద్రబాబు స్కెచ్ గీస్తున్నారట.. ముఖ్యంగా రాజధాని ప్రాంతాలుగా గుర్తింపు పొందిన విజయవాడ, విశాఖ ఎంపీ స్థానాల్లో తమ వారు ఉంటే బెటర్ అని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.. విజయవాడలో టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. ఇప్పుడు పార్టీకి పూర్తి దూరంగా జరిగారు. చంద్రబాబుతో గ్యాప్ పెరిగింది. విజయవాడ, కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కొందరితో ఆయనకు పొసగడం లేదు. దీంతో ఇక్కడ అభ్యర్థి మార్పుపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే విజయవాడలో కోడలు నారా బ్రాహ్మణిని ఎంపీగా దించడానికి చంద్రబాబు స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేసిన బ్రాహ్మిణి హెరిటేజ్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. పరిశ్రమను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఆమె ఎంపీగా ఉంటే లోక్ సభలో టీడీపీకి ప్లస్ అవుతుందని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. అదే సమయంలో బ్రాహ్మిణి సైతం ప్రజాసేవకు సై అన్నారుట. అందుకే విజయవాడ పార్లమెంట్ స్థానం అయితే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారుట.
ఇక భార్య భువనేశ్వరిని రాజధానిగా జగన్ మార్చుతున్న విశాఖ నుంచి బరిలోకి దింపేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఎంపీ ప్రతిష్టాత్మకంగా ఉండాలి కాబట్టి తన భార్యనే చంద్రబాబు విశాఖ బరిలో దింపుతున్నారట.. ఇలా రెండు కీలక ఎంపీ స్థానాలను భార్య, కోడలికి ఇస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.