Yadagiri gutta : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు మరోసారి మారబోతోందా. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయం లో యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మార్పు చేసారు. ఏపీలోని తిరుమల తిరుపతి స్థాయిలో ఆలయాన్ని అభివృద్ధి చెందాలని.. యాదాద్రి అని నామకరణం చేశారు. శ్రీలక్ష్మీ నరసింహుడి ఆల యాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించినప్పుడు ప్రకటించారు. ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని యాదగిరి గుట్టగానే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీలక్ష్మీ నరసింహుడు కొలువై ఉన్న యాదాద్రి పేరును మార్పు పైన చర్చ సాగుతోంది. సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఈ యాదాద్రి పేరును త్రిదండి చినజీయర్ స్వామి సూచించారన్న ప్రచారం కూడా జరిగింది. చాలా కాలంగా యాదాద్రి అనే ప్రస్తావిస్తున్నారు. కొంత కాలంగా యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగానే పిలవాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఈ పేరు మార్పు పైన కీలక వ్యాఖ్య లు చేసారు. యాదాద్రిని మళ్లీ యాదగి రిగుట్టగా మారుస్తామని ఆలయ సన్నిధిలో వెల్లడించారు.
ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు. త్వరలోనే సీఎం క్షేత్ర సందర్శనకు రానున్నట్లు తెలిపారు. నెల రోజుల్లోగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి క్షేత్రాని కి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా ప్రయత్నిస్తా మని వివరించారు. కొండ పై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పూర్వం నుంచి ఈ క్షేత్రానికి ఉన్న పేరు మార్చటం సరి కాదన్నారు. ఆలయ పూజారుల కోసం విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో, ఇప్పుడు యాదాద్రి పేరు మార్పు పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.