వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేంటని మజ్లిస్ అధినేత ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ వ్యాపారం చేస్తున్న ఒవైసీ అసలు రంగు ఈ రోజు పూర్తిగా బయటపడిందని పేర్కొన్నారు. టీటీడీకి, వక్ఫ్ బోర్డు భూములకు లింకు పెట్టడమే అందుకు నిదర్శనమని, ఈ రెండింటికి ఆయనకు తేడా తెలియదని విమర్శించారు. ఈ మేరకు ఈ మేరకు ఆయన శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూముల వ్యవహారాలకు సంబంధించినది. అయినా టీటీడీకి, వక్ఫ్ బోర్డు పేరుతో సాగిస్తున్న భూముల దందాకు లింకు పెడతారా? వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు దగ్గాలన్నదే కేంద్రం ఉద్దేశం. అందులో భాగంగానే బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తో పదేళ్లు అంటకాగిన ఎంఐఎం, ఎంఐఎం, ఈ రోజు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది’’ అని విమర్శించారు.
Breaking News