24 C
India
Sunday, October 11, 2026
More

    AP Minister Botsa Counter : పవన్ వి గాలిమాటలు.. ఏపీ మంత్రి బొత్స కౌంటర్..

    Date:

    pawan bosta
    pawan bosta

    AP Minister Botsa Counter వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసి నాలుగు రోజులు గడిచినా, ఇంకా ఏపీలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతల్లో పెద్ద అలజడే రేపింది. గుమ్మడి కాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ ను తిట్టి పోస్తున్నారు. అయితే తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు.

    పవన్ వి గాలి మాటలంటూ కొట్టిపారేశాడు బొత్స. అసలు ఆ మాటల్ని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ చెప్పుకొచ్చారు. వలంటీర్ వ్యవస్థ ఎందుకు తెచ్చామో ముందుగా పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిదన్నారు. దేశానికి ఆదర్శంగా ఈ వలంటీర్ల వ్యవస్థ నిలిచిందని బొత్స డబ్బా  కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఆడపిల్లలను లోబర్చుకుంటున్నామంటూ పవన్ వ్యాఖ్యలు సరిగా లేవని మండిపడ్డారు.పవన్ పార్టనర్ చంద్రబాబే హైదరాబాద్ లో ఉంటారంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సమాచారాన్ని హైదరాబాద్ లో ఉంచాల్సిన అవసరం తమకు లేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఈ విషయాలు ఏ నిఘా వర్గాలు చెప్పాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వలంటీర్ల వ్యవస్థపై బురద జల్లితే చూస్తూ ఊకోబోమని చెప్పారు.  ఆధారాలు ఉంటే రాష్ర్ట ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    అయితే మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా బొత్స కామెంట్ చేశారు. గతంలో ఆయన రాష్ర్టానికి తెచ్చిన సింగపూర్ మంత్రిని అక్కడ అరెస్ట్ చేశారని, సింగపూర్ ప్రభుత్వంతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చెల్లదని తాను గతంలో చెప్పానని గుర్తు చేశారు.  చంద్రబాబు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయని, ప్రజలు ఆయన్ను నమ్మొద్దు అంటూ మాట్లాడారు. మరోవైపు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఒక యూజ్ లెస్ అంటూ సంబోంధించారు.

    యూజ్ లెస్ మాటలు పట్టించుకోబోమని చెప్పారు. బొత్స ఎప్పుడు మాట్లాడిన ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడడం కామన్ అయిపోయ్యింది. అయితే ఈసారి పవన్ , చంద్రబాబు, రఘురామ పై ఆయన తన ప్రతాపం చూపించారు. మరి ఆయా పార్టీల నుంచి కూడా బొత్సపై కౌంటర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే అర్ధగంట మంత్రి అంటూ ఆయనను విపక్షాలు ఆడుకుంటూ ఉంటాయి. ఇక ఇప్పుడు జనసేన శ్రేణుల ట్రోల్స్ భారీ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...